ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం బేఖాతరు చేయడం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో గ్రామ సచివాలయానికి వైకాపా రంగులు పులమడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా అటువైపుగా వెళ్తున్న వీరికి ఈ దృశ్యం కనిపించింది.
'హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు' - party color for gram sachivalayam in visakha district
అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో గ్రామ సచివాలయానికి వైకాపా రంగులు అద్దడాన్ని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఖండించారు. హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోదా? అంటూ మండిపడ్డారు.
గ్రామ సచివాలయానికి పార్టీ రంగు