విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కొవిడ్ కేసుల సంఖ్య వేలల్లోకి చేరాయి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్రెడ్డి సూచనతో ఆగస్టు 11 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలు తెరిచేలా పాక్షిక లాక్ డౌన్ విధించారు. అనంతరం స్వచ్చంద లాక్డౌన్ విధించారు. పాక్షిక లాక్డౌన్ వల్ల కేసులు అదుపులోకి వచ్చినందున... సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు పాక్షిక లాక్డౌన్ విధించాలని వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు పట్టణంలో మరో వారం రోజులు పాక్షిక లాక్డౌన్ విధించే అవకాశం ఉంది.
అనకాపల్లిలో సెప్టెంబర్ 6 వరకు పాక్షిక లాక్డౌన్! - anakapalli latest news
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు పట్టణంలో సెప్టెంబర్ 6 వరకు పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు.
![అనకాపల్లిలో సెప్టెంబర్ 6 వరకు పాక్షిక లాక్డౌన్! Partial lockdown in Anakapalle till September sixth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8619194-722-8619194-1598807698317.jpg)
అనకాపల్లిలో సెప్టెంబర్ ఆరు వరకు పాక్షిక లాక్డౌన్