రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో విశాఖ జిల్లా అనకాపల్లిలో పాక్షిక లాక్ డౌన్ పాటించారు. మధ్యాహ్నం 1 గంటకు దుకాణాలు అన్ని మూసేసారు.దీనితో అనకాపల్లి ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. శని ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ పాటిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. అనకాపల్లి లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ పాటించాలని వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూచించారు. దీనికి వ్యాపారులంతా సహకరించి లాక్ డౌన్ పాటించారు.
అనకాపల్లిలో పాక్షిక లాక్ డౌన్ - corona news in vishaka
విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో పాక్షికంగా లాక్డౌన్ విధించారు. వ్యాపార దుకాణాలు అన్ని మూసేశారు. ప్రజలెవ్వరు అనవసరంగా బయట తిరగొద్దని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హెచ్చిరించారు. ఎమ్మెల్యే వ్యాపారులతో సమావేశమై ఈ కోవిడ్ మహమ్మారి నివారణలో భాగంగా అందరు సహకరించాలన్నారు.
అనకాపల్లిలో పాక్షిక లాక్ డౌన్