ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో పాక్షిక లాక్ డౌన్ - నర్సీపట్నంలో పాక్షిక లాక్ డౌన్ అమలు

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని పలు మండలాల్లోని వ్యాపార సంస్థలు పాక్షిక లాక్​డౌన్ పాటించాలని నిర్ణయించాయి. నర్సీపట్నం మున్సిపల్ ఛైర్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వర్తక సంఘం నిర్ణయం తీసుకుంది.

Partial lock down implementation in Narsipatnam Division
Partial lock down implementation in Narsipatnam Division

By

Published : Apr 28, 2021, 1:11 PM IST

ఇటు మైదాన.. అటు గిరిజన ప్రాంతాలకు ముఖ్య వ్యాపార కూడలిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లా నర్సీపట్నం తదితర మండలాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి పాక్షిక లాక్​డౌన్​ ఏర్పాటు చేయాలని నర్సీపట్నం వర్తక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటైన వర్తక సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగానే... ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచి ఉంచేలా నిర్ణయించారు. ఈ నిబంధనలను వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎవరు అతిక్రమించిన పట్టణ పోలీసులు చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్ పర్సన్ ఆదిలక్ష్మి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details