విశాఖ జిల్లా పెదబయలు మండలానికి చెందిన గిరిజన యువతి, కప్పాడకు చెందిన ఏలియా అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలను అడిగారు. ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. అప్పటికే యువతి గర్భిణి. ఇంతలో.. యువకుడు ఏలియాకు వారి కుటుంబీకులు వేరే పెళ్లి చేసేశారు.
ఈ రోజు ఆస్పత్రిలో యువతి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చేందుకూ యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. శిశువును ఎవరికైనా ఇచ్చేస్తామని పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బంది ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బిడ్డను వదిలేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. చివరికి వారు కొంతవరకూ సద్దుమణిగారు. తనకు న్యాయం చేయాలని యువతి డిమాండ్ చేసింది.