ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన - Parents protest in vishaka

ప్రైవేటు పాఠశాల్లో ఫీజు తగ్గింపును ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కొవిడ్​ కారణంగా జారీ చేసిన పాఠశాల ఫీజు తగ్గింపును.. కొన్ని యాజమాన్యాలు పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Parents protest
విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

By

Published : Jan 29, 2021, 12:41 PM IST

విశాఖలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గించాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా కారణంగా.. ప్రభుత్వం 30% ఫీజు తగ్గింపు కోసం జీవోనెం.57 ను జారీ చేసింది. అయితే నగరంలోని ఓ పాఠశాల ఈ ఉత్తర్వులను పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్​ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ప్రస్తుతం కేవలం 100 మందికి మాత్రమే 30 శాతం ఫీజు తగ్గించటంపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు రాత్రంతా డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ఇదీ చదవండీ..పల్లె పోరు: నేటి నుంచే నామినేషన్లు.. 9న ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details