ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్​ పాఠశాలల తీరును ఖండిస్తూ... టవర్​ ఎక్కి నిరసన - సెల్ టవర్ ఎక్కి నిరసన

ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొంటూ... విశాఖలో ముగ్గురు వ్యక్తులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. ఈ చర్యల వల్ల తల్లిదండ్రులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

parents protest against  Private school activities on tuition fees at vishakha
ప్రైవేట్​ పాఠశాలల తీరును ఖండిస్తూ... టవర్​ ఎక్కి నిరసన

By

Published : Sep 28, 2020, 3:17 PM IST

విశాఖలో ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. యాజమన్యం తీరును ఖండిస్తూ... ముగ్గురు వ్యక్తులు నగరంలో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ... కొవిడ్ కాలంలో తల్లిదండ్రులపై భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details