విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ప్రిన్సిపాల్ తమ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ, అతని బంధువుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డను తనకు అప్పగించాలని.. చదువు కోసం విద్యార్ధిని పంపిస్తే మాయ మాటలతో లోబరుచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'ప్రిన్సిపాల్ చెర నుంచి మా పిల్లలను విడిపించండి' - విశాఖ మన్యం పాడేరు తాజా వార్తలు
విశాఖ మన్యం పాడేరులోని మారుమూల గిరిజన గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. ప్రిన్సిపాల్ తప్పుదారి పట్టిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్ధిని తల్లితో పాటు 15 గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఐటీడీఏ వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రిన్సిపాల్ తీరు మారకపోగా.. మైనర్ బాలికలను మభ్యపెట్టి బయట తిప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా తన తప్పు లేదని సమర్ధించుకున్నాడు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి విద్యార్ధిని కనిపించకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రిన్సిపాలే తన కుమార్తెను బంధించాడని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై 15 గ్రామాల ప్రజలు పాడేరు ఐటీడీఏ వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను అప్పగించి పాఠశాల ప్రిన్సిపాల్, అతని బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...