రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నేడు విశాఖలో ఘనంగా ప్రారంభమయింది. ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, వైకాపా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని మంత్రి చెప్పారు. సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా దివ్యాంగ క్రీడాకారులు సత్తా చాటుతారని మంత్రి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు బహుమతి అందిస్తోందన్నారు. ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మార్చి 19 నుంచి 22 వరకు ఒడిశాలో జరగనున్న జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో పారాబ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం - para badminton champion ship
రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విశాఖలో ప్రారంభమైంది. ఈ క్రీడలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. దివ్యాంగ క్రీడాకారులు సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు.

నేటి నుంచి విశాఖలో పారాబ్యాడ్మింటన్ ఛాంఫియన్షిప్
విశాఖలో పారాబ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం
ఇదీ చదవండి:
విశాఖలో 'దిశ' పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు