ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం పట్టించుకోవట్లే.. ఎన్నికలు బహిష్కరిస్తున్నాం' - surlapalem news

పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు విశాఖ జిల్లా గెమ్మెలి పంచాయతీ సుర్లపాలెం వాసులు ప్రకటించారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ గ్రామం అభివృద్ధికి నోచుకోవట్లేదని.. అందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

panchayathi elections bye cot by surlapalem
'ప్రభుత్వం పట్టించుకోట్లే.. ఎన్నికలు బహిష్కరిస్తున్నాం'

By

Published : Feb 16, 2021, 10:45 PM IST

స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు గడుస్తున్నా మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నామని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ సూర్లపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమందిని గెలిపించినా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వాలు మారినా.. తమను పట్టించుకునే నాథుడే కరవయ్యారని చెప్పారు. రోడ్డు మార్గం లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రికీ వెళ్లలేకపోతున్నామని వాపోయారు. నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details