ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో తొలిరోజు ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ - పంచాయతీ ఎన్నికల నామినేషన్లు విశాఖపట్నం

విశాఖ జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగింది. నామినేషన్ కేంద్రానికి సర్పంచ్ అభ్యర్థులు ఉరేగింపుగా రావడంతో పండగ వాతవరణం నెలకొంది. అనకాపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు, 15 మంది వార్డు మెంబర్లు నామినేషన్ వేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు పంచాయతీ ఎన్నికల అధికారి కృష్ణకుమారి చెప్పారు.

dsp
విశాఖలో తొలిరోజు ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

By

Published : Jan 29, 2021, 8:37 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కేంద్రాలకు ఊరేగింపుగా వచ్చారు. అనకాపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు, 15 మంది వార్డు మెంబర్లు నామినేషన్ వేశారు. కశింకోట మండలం 27 పంచాయతీలకు 10 సర్పంచ్, 53 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్ వేశారు. తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ ఎన్నికల అధికారిణి కృష్ణకుమారి చెప్పారు.

అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో బాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి కొత్తూరు పంచాయతీ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:చోడవరం నియోజకవర్గంలో నామినేషన్లు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details