విశాఖ పాడేరు ఏజెన్సీలో ఎన్నికల కోలాహలం వేడెక్కింది. ఆశావహులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు... పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి.. 344 సర్పంచ్ అభ్యర్థులు.. 423 వార్డు మెంబర్లు.. తొలిరోజు నామినేషన్లను దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందని కారణంగా... ఆందోళన పడుతున్నారని పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి చెప్పారు.
సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. గతంలో ఏజెన్సీ వ్యాప్తంగా 60 శాతం మాత్రమే పోలింగ్ ఉందని.. ప్రస్తుతం 90 శాతం పైగా నమోదవ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు జరిగే 17వ తేదీని పాడేరు డివిజన్లో సెలవు దినంగా ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు నిర్వహిస్తామని చెప్పారు.