తెదేపా సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. మూడు రాజధానులను తెదేపా వ్యతిరేకించటాన్ని ఆయన తప్పుబట్టారు. విశాఖను పాలన రాజధానిగా చేయటం పార్టీ పెద్దలకు రుచించటం లేదని, వారి నిర్ణయం సరైంది కాదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపులేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపాను వీడిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ - తెదేపాకు పంచకర్ల రమేశ్ రాజీనామా
తెదేపాకు పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు రాజీనామా చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయటం తెదేపా పెద్దలకు రుచించటం లేదని, వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
తెదేపాను వీడిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్