విశాఖ మన్యంలో విశిష్టత కలిగిన మత్స్య లింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో వెలసిన మత్స్య లింగేశ్వర స్వామి దేవాలయంలో చేపలు, పాములకు పూజలు చేస్తారు. ప్రతి శివరాత్రి రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీతో పాటు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టింది. పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
విశాఖ మత్స్య లింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - Matsya Lingeshwara Shivaratri Celebrations news update
అక్కడి ఆలయంలో చేపలు, పాములకు పూజలు చేస్తారు. ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ముల్లోకాలు ఏలే ముక్కంటి విశాఖ మన్యంలో మత్స్యలింగేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తాడు.
![విశాఖ మత్స్య లింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి Matsya Lingeshwara Shivaratri Celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6121941-777-6121941-1582089136070.jpg)
పాడేరులో శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన మత్స్య లింగేశ్వరుడు
పాడేరులో శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన మత్స్య లింగేశ్వరుడు
ఇవీ చూడండి...