'తెదేపా నేతల అరెస్టు అక్రమం.. వెంటనే విడుదల చేయండి' - పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడేరు తెదేపా నేతలు.. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. వైకాపా పాలనపై పోస్టర్లు చూపి ఎద్దేవా చేశారు. వెంటనే నాయకులను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
విశాఖ మన్యం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెదేపా నాయకులు కార్యకర్తలతో ఇంటి వద్ద నిరసన చేపట్టారు. వైయస్సార్ పార్టీ ఈ ఏడాది పాలన పై పోస్టర్లలో చూపించి ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం తెదేపా శ్రేణుల పై కక్ష సాధింపుతో అరెస్టులు చేస్తున్నారన్నారు. వెంటనే నాయకులను విడుదల చేయాలంటూ పేర్కొన్నారు. ఏడాది పాలన పై ప్రజల్లోకి వెళతానని గిడ్డి ఈశ్వరి చెప్పారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది చదవండి'మహిళల ఆర్థిక బలోపేతమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం'