ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుకుండలా పాడేరు జలాశయం

విశాఖ జిల్లా పెద్దేరు జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుకోవటంతో... నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అధికారులు జలాశయం వద్దే ఉండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

By

Published : Aug 13, 2020, 9:39 PM IST

paderu  reservoir filled with rain water
నిండుకుండలా పాడేరు జలాశయం

నిండుకుండలా పాడేరు జలాశయం

విశాఖ జిల్లా పెద్దేరు జలాశయంలో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. ఆయకట్టులో వరినాట్లకు సాగునీటిని విడుదల చేస్తుండగా.. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి అదనపు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవటంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

జలాశయం గరిష్ఠ స్థాయి నీటి మట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 136.25 మీటర్లకు వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 69 క్యూసెక్కుల మేర వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవటంతో జలవనరుల శాఖ అధికారులు జలాశయం వద్ద ఉండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details