ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఆటోప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం - latest news on paderu

ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొని ఏడుగురు మృత్యువాత పడిన ఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని... ఇటీవల 'ఈటీవీ భారత్'లో కథనం ప్రచురితమైంది. దీనిపై పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి స్పందించారు. పది రోజుల్లో ప్రభుత్వ నుంచి సాయం అందిస్తామని హామీఇచ్చారు.

paderu-mla-bagyalaxmi-respond-on-etv-bharat-story-on-auto-accident-incident
భారత్ ఎఫెక్ట్:ఆటో ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం!

By

Published : Dec 26, 2019, 12:00 PM IST

Updated : Dec 26, 2019, 5:05 PM IST

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఆటోప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

జూన్ 2న చింతపల్లి మండలం కోరుకొండ పంచాయతీ చెరువులో... విద్యుత్ స్తంభానికి ఆటో ఢీకొని ఏడుగురు మృతిచెందారు. ఆ సమయంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. త్వరలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే 7 నెలలు కావస్తున్నా నష్టపరిహారం అందలేదు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు 'ఈటీవీభారత్'తో చెప్పగా... దీనిపై కథనం ప్రచురితమైంది. స్పందించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి... విద్యుత్ శాఖకు సంబంధించిన నష్టపరిహారం చెక్కులు వచ్చాయని... వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. మరో పది రోజుల్లో ప్రభుత్వ సాయం కూడా అందుతుందని... తక్షణమే చెల్లిస్తామని ఈ హామీ ఇచ్చారు.

Last Updated : Dec 26, 2019, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details