ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని వైద్యులకు పాడేరు ఐటీడీఏ అధికారి ఆదేశం - visakha district latest news

పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా కొయ్యూరు మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టి, ఆసుపత్రుల్లో ప్రసవాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు.

paderu itda po sudden visit to hospitals, schools and lands in visakha district
పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ ఆకస్మిక పర్యటన

By

Published : Jul 9, 2020, 12:17 PM IST

ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి వెంకటేశ్వర్​ వైద్యులను ఆదేశించారు. బుధవారం కొయ్యూరు మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలు తక్కువగా జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్​డీఎఫ్​ నిధుల వినియోగంపై ఆరా తీశారు. కంఠారం ఆరోగ్య కేంద్రంలో మలేరియా జ్వరాల వ్యాప్తి, నిధుల చెల్లింపులు అడిగి తెలుసుకున్నారు.

డౌనూరు, చిట్టెంపాడు, కొమ్మిక పాఠశాలల్లో లక్షల రూపాయలతో జరుగుతున్న నాడు- నేడు పనులు పరిశీలించారు. సచివాలయ భవనాన్ని ఆగస్టు చివరినాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్​ అధికారులను ఆదేశించారు. చిట్టెంపాడులో రేషన్​ డిపోని సందర్శించి ఉచిత బియ్యం పంపిణీ తీరు గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండలో ఆర్​ఓఎఫ్​ఆర్​ భూముల సర్వే జరుగుతున్న తీరు రైతులను అడిగి తెలుసుకున్నారు. మన్యంలో 13,200 ఎకరాల భూములకు హక్కు పత్రాల పంపిణీకి చర్యలు తీసుకొంటున్నట్టు వెంకటేశ్వర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details