ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​ రింగ్​ అయ్యిందా..మీ పని అంతే అంటున్న అధికారి - విశాఖ తాజా వార్తలు

సాధారణంగా ఏదైనా సమావేశంలో ఎవరి ఫోనైనా రింగ్ అయితే అందరీ చూపు సదరు వ్యక్తిపై ఉంటుంది. అసౌకర్యానికి పైవారు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ ఓ అధికారి మాత్రం ఏకంకా ఫోన్లను విసిరేస్తారు. సదరు అధికారి పేరు చెప్తే ఫోన్​లు స్విఛాఫ్ పెట్టుకోవాల్సిందే. లేకుంటే అంతే సంగతులు.. ఇంతకు ఆయన ఎవరు.. ఆ అధికారి అంటే అంత భయమెందుకు?

విశాఖ paderu itda officerపాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి
విశాఖ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి

By

Published : Jun 19, 2021, 7:13 PM IST

కాఫీ ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బందితో విశాఖ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం జరుగుతోంది. అంతలోనే ఓ ఉద్యోగి మొబైల్ రింగ్ అయింది. ఎవరా వ్యక్తి అంటూ దగ్గరికి పిలిపించుకుని సదరు ఉద్యోగిని హెచ్చరించారు సదరు ఆఫీసర్. సమావేశాలు జరుగుతున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం తెలియదా అంటూ మందలించారు. సమావేశాల్లో ఫోన్ రింగ్ అయితే సహించేది లేదని ఇప్పటికే 30 ఫోన్లు విసిరేశానని అధికారులకు హెచ్చరించారు. సమావేశాలు జరిగేటప్పుడు ఫోన్ స్విచాఫ్ చేసుకోవాలని అందరికీ సూచించారు.

సమావేశాల్లో ఫోన్​ రింగ్​ అయితే మీ ఫోన్లు పగిలిపోతాయంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాడేరులో సుడిగాలి పర్యటనలతో అధికారులను, ఉద్యోగులను హడలెత్తిస్తున్నారు. నాడు-నేడు పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఇదే సమయంలో సమావేశాల్లో ఫోన్ల వాడకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details