ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జ్ఙాపకాల వేటలో... మూడు దశాబ్దాల వెనక్కి - విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ పాఠశాలలో 1990 సంవత్సరంలో 10వ తరగతి పూర్వపు విద్యార్థులు కలయిక

విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ పాఠశాలలో 1990 సంవత్సరంలో 10వ తరగతి పూర్వపు విద్యార్థులు తిరిగి కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఙాపకాలను నెమరు వేసుకుని సంతోషంగా గడిపారు. జీవితంలోని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

old students meet in paderu gov school
జ్ఙాపకాల వేటలో మూడు దశాబ్దాల వెనక్కి

By

Published : Dec 27, 2020, 7:18 PM IST

విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ పాఠశాలలో 1990 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు అదే పాఠశాలలో సమావేశమయ్యారు. ప్రస్తుతం అందరూ వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడి ఉండడంతో ఒకరినొకరు పోల్చుకోవడంలో కూడా కాస్త ఇబ్బందిపడ్డారు. ఆనాటి ఇంటి పేర్లతో పిలుచుకుని ఒక్కసారి కేరింతలు కొట్టారు.

వీరిలో కొందరు వ్యాపారులు, కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు రెవెన్యూ సిబ్బందిగా ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్ననాటి చిలిపి చేష్టలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుని ఆనందించారు. ప్రస్తుతం వారు చేస్తున్న పనులు, వారి పిల్లల చదువులు, ఎక్కడ నివసిస్తున్నది వంటి వ్యక్తిగత విషయాలు పరస్పరం పంచుకున్నారు. 30 ఏళ్ల తర్వాత అందరూ తిరిగి కలవడంతో.. వారిలో ఆనందానికి అవధులు లేకుండాపోయింది.

ఇదీ చదవండి: ఎద్దు ఆటోలు.. కార్లు.. భలే భలే!

ABOUT THE AUTHOR

...view details