విశాఖ జిల్లా పాడేరులో లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు విస్తృత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ.. అర్థరాత్రి వేళ చెక్ పోస్టులు తనిఖీ చేశారు. పాడేరు ఘాట్ రోడ్ వంటలమామిడి, వంతాడపల్లి చెక్ పోస్టు గేట్ల వద్ద వాహనాల రాకపోకల వివరాలు తెలుసుకున్నారు. గరిక బంద చెక్ పోస్టు నుంచి కొందరు ద్విచక్ర వాహనాలపై రావడాన్ని ప్రశ్నించారు. లాక్ డౌన్ ఉంటే ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
అర్థరాత్రి వేళ.. చెక్పోస్టుల్లో తనిఖీలు - police are strictly implementing lock down
విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ... అర్థరాత్రి వేళ చెక్ పోస్టులు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనాలపై తిరిగేవారిని ఆపి ప్రశ్నించారు.
ఐటీడీఏ పీవో అర్థరాత్రి పాడేరు ఘాట్ రోడ్ చెక్ పోస్టులు తనిఖీలు