విశాఖ మన్యం కేంద్రం పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో మత్స్యగుండం అనే ప్రాంతముంది. ఓవైపు పర్వతాల మీదుగా జాలువారే నీటి సవ్వడులు-చేపల సందడి, మరోవైపు అందమైన ఉద్యానవనంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయమూ ఉంది.
మత్స్యాలు, సర్పాలు ఇక్కడ యుద్ధాలు చేసుకునేవని.. శివుని అనుగ్రహంతో కలసిమెలసి జీవించేవని ఇక్కడి స్థల పురాణం. సెలయేటిలోని చేపలను ఇక్కడ ఎవరూ వేటాడరు. దేవతలుగా కొలుస్తారు. వాటికీ ఆహారమూ అందిస్తారు. కోరుకున్నవి నెరవేరితే మొక్కులూ సమర్పించుకుంటారు.