ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

ప్రాణవాయువు కొరతతో సతమతమవుతున్న మహారాష్ట్రకు విశాఖ స్టీల్ ప్లాంటు ఊపిరందిస్తోంది. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ రైలు ద్వారా 105 టన్నుల మెడికల్ ఆక్సిజన్​ను ఉక్కు పరిశ్రమ అధికారులు పంపించారు.

Oxygen Express
ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

By

Published : Apr 23, 2021, 1:08 AM IST

Updated : Apr 23, 2021, 6:27 AM IST

ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ రైలు బయల్దేరింది. రాత్రి ఎనిమిది గంట‌ల స‌మయానికే అన్ని భ‌ద్ర‌తా చ‌ర్య‌లు పూర్తి చేసుకుని సిద్ద‌మైన ఈ రైలు, గ్రీన్ ఛానెల్ కోసం ఎదురు చూసింది. రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో స్టీల్ ప్లాంట్ యార్డ్ నుంచి త‌న ప్ర‌యాణాన్ని ఆరంభించింది.

మహారాష్ట్ర నుంచి ఏడు ట్యాంకర్లతో గురువారం తెల్లవారుజామున స్టీల్ ప్లాంటుకు రైలు చేరుకోగా... జాగ్రత్తలను పాటిస్తూ స్టీల్ కర్మాగారం సిబ్బంది ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపారు.

తొలి విడతలో ఏడు ట్యాంకుల ద్వారా 105 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు రవాణా అవుతోంది. ఆక్సిజన్ ప్రత్యేక రైలుకు తూర్పు కోస్తారైల్వే గ్రీన్ ఛానెల్ ద్వారా మార్గం కల్పిస్తోంది.

ఇవీచదవండి.

తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులపై నోటీసులు

మిర్చి, మామిడి ధరలు పడిపోలేదు: మంత్రి కన్నబాబు

Last Updated : Apr 23, 2021, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details