ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పరికరం కరోనా రోగులకు ప్రాణవాయువు అందిస్తుంది..! - visakha naval dockyard employee made oxygen equipment

కరోనా బారిన పడిన వారికి సులువుగా ఆక్సిజన్​ అందించేలా ఓ పరికరాన్ని విశాఖ నావల్​ డాక్​యార్డ్​ సిబ్బంది రూపొందించారు. వీరు తయారు చేసిన ఇన్నోవేటివ్ పోర్టబుల్ మల్టీ - ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్​ అనే యంత్రం ద్వారా ఏకకాలంలో ఆరుగురికి ఆక్సిజన్​ సరఫరా చేయవచ్చు. తొలుత 5 యూనిట్లను డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ కలెక్టర్​ వినయచంద్​కు అందజేశారు.

visakha naval dockyard employee made oxygen equipment
కరోనా రోగులకు నేవీ పరికరంతో ప్రాణదానం

By

Published : Apr 10, 2020, 9:57 AM IST

కరోనా మహమ్మారికి గురై ఆక్సిజన్ సరఫరా లేక ఎందరో రోగులు ప్రాణాపాయంలో పడుతున్నారు. బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు కొన్ని ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా విశాఖ నావల్​ డాక్‌యార్డ్ సిబ్బంది వినూత్నమైన పోర్టబుల్ మల్టీ - ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ అనే పరికరాన్ని రూపొందించారు. ఈ యంత్రం ద్వారా ఏకకాలంలో ఆరుగురికి ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. ఫైన్ అడ్జస్ట్‌మెంట్ రెడ్యూసర్, ఆక్సిజన్ సిలిండర్, పోర్టబుల్ ఎంఓఎంను అనుసంధానించి ఈ యంత్రాన్ని తయారుచేశారు. మొత్తం 25 యూనిట్లు జిల్లా యంత్రాంగానికి ఇవ్వనున్నారు. వీటిలో 5 యూనిట్లను డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ రియర్ అడ్మిరల్ సుదీప్.. కలెక్టర్ వి.వినయ్ చంద్​కు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details