ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా ఆక్స్‌ఫర్డ్ ‌- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ - corona vaccine updates

ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ్ ట్రయల్స్ ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జి ఆస్పతిలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్ల నియామకం జరుగుతోందని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్స్ పల్ డాక్టర్ పీవి సుధాకర్ తెలిపారు.

corona vaccine trails
వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్

By

Published : Oct 29, 2020, 9:36 PM IST

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్.. ఐసీఎంఆర్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జి ఆస్పతిలో జోరుగా జరుగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యానికి చేరువలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్ల నియామకం జరుగుతోందని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్స్ పల్ డాక్టర్ పీవి సుధాకర్ వెల్లడించారు.

ఈ ఫలితాలను, వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలను ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ నిర్దేశించిన నమూనా ప్రకారం ఆన్లైన్ లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. వారు ఆ వివరాలను విశ్లేషిస్తున్నారని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ ఫలితాలు అన్ని చోట్ల నుంచి తీసుకుని ఆక్స్ ఫర్డ్ చివరిగా ప్రకటిస్తుందని తెలిపారు. విశాఖలో తొలిరోజున వాక్సిన్ ఇచ్చిన వ్యక్తికి మళ్లీ 29వ రోజున మరో డోస్ ఇస్తారని పీవీ సుధాకర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details