ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు - విశాఖలోని మన్యం వార్తలు

అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా మన్యంలో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

overflow of geddalu
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు

By

Published : Oct 13, 2020, 4:51 PM IST

విశాఖ జిల్లా మన్యంలో భారీ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో ప్రధాన నది అయిన మత్స్య గెడ్డ పరవళ్ళు తొక్కుతోంది. రాయగడ వంతెన పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దారి ఎక్కువగా గిరిజనులు పట్టణంలోకి వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఉత్పత్తులు అమ్ముకునేందుకు, ఇతర అవసరాలకు వారికు అంతరాయం ఏర్పడింది.

విశాఖ మన్యంలో గెడ్డల ప్రవాహం

పరదానిపుట్టు వద్ద మద్ది గెడ్డ వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఉదయం పూలు అమ్ముకోవడానికి అవతలి వైపుకు వెళ్ళిన రైతులు అక్కడే చిక్కుకున్నారు. వర్షం ఆగిపోయి, ప్రవాహం తగ్గేవరకు ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. ఈ దారిలో ఎత్తయిన వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి గిరిజనులు మొరపెట్టుకున్నా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రైల్వే ట్రాక్​పై కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details