విశాఖపట్నం సింహాచలం 98వ వార్డులో.. ప్రతిపక్ష నాయకులు వైకాపాలో చేరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో కార్యకర్తలు వైకాపా కండువా వేసుకున్నారు. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమగల దేవుడు. ఆ నియోజకవర్గంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు.. మంత్రి అవంతి అన్నారు.
వైకాపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి.. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పదవులు శాశ్వతం కాదు.. చేసిన అభివృద్దే శాశ్వతంగా నిలుస్తుందని హితవు పలికారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.