ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల మధ్యలో చెత్తకు నిప్పు.. వృద్ధుల ఇబ్బందులు - విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజపురం

అనాథాశ్రమం పక్కన ప్లాస్టిక్​ వ్యర్థాలు కాల్చవద్దంటూ వృద్ధులు వేడుకున్నారు. జీవనం సాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్టిక్​ వ్యర్థాల కాల్చివేతతో వస్తున్న దుర్వాసనకు ముక్కు మూసుకున్న వృద్ధులు

By

Published : Jul 6, 2019, 3:38 PM IST

ఓ దాత ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో...వృద్ధులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం వారి మనుగడకే కష్టమొచ్చింది. ఆశ్రమం పక్కనే చెత్త నుంచి సంపద కేంద్రాన్ని నిర్మించారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారికీ ప్రత్యేకంగా నిర్మించిన సిమెంట్ కుండీలను దుర్వినియోగం చేస్తూ గ్రామంలో సేకరించిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను నింపి కాల్చుతున్నారు. వృద్ధాశ్రమం పక్కనే ఈ తతంగం నిర్వహిస్తుండటంతో... ఆశ్రమవాసులు దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల మధ్యలో చెత్తకు నిప్పు.. వృద్ధుల ఇబ్బందులు

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజపురంలోని యాళ్ల వెంకటలక్ష్మి ....శ్రీ లలితా దేవి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో భవనాలు నిర్మించారు. ఇటీవల ఈ ఆశ్రమం పక్కన చెత్త నుంచి సంపద కేంద్రాన్ని నిర్మించారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారికీ సిమెంట్ కుండీలు నిర్మించారు. ఈ కుండీలను ఎరువు తయారు చేసేందుకు వినియోగించకుండా.. గ్రామంలో ఏరితెచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు, మందుల సీసాలను తీసుకొచ్చి కుండీలో వేసి కాల్చుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చివేసిన దుర్వాసనతో పక్కనే ఉన్న వృద్ధులు భరించలేకపోతున్నారు. ముక్కు మూసుకుని జీవనం సాగిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతోనూ ఇద్దరు మరణించారు.
అధికారులు త్వరితగతిన స్పందించి ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చకుండా నివారించాలని వృద్ధులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details