జనావాసాల మధ్యలో..
ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పరిధిలో ఉంది. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా) బృహత్తర ప్రణాళిక ప్రకారం పారిశ్రామిక జోన్‌లోనే పరిశ్రమ ఉంది. సుమారు 52 ఏళ్ల కిందట నగరానికి దూరంగా ఏర్పాటైన పరిశ్రమ చుట్టూ పట్టణీకరణ వల్ల నివాస ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక జోన్‌లు, కర్మాగారాలు జనావాసాల పరిధిలోకి చేరాయి. వివిధ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న విజయవాడ ఆటోనగర్ కూడా ఇదే తీరులో ఉండటం గమనార్హం.
సమాచారం కోసం ఆదేశం