విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తనఖా పెట్టొద్దంటూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. చెత్తపై పన్ను వేయడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం కార్పొరేటర్ గంగారాం.. వినూత్నంగా సీఎం జగన్ బొమ్మతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడం.. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తనఖా పెట్టొద్దు: ప్రతిపక్ష కార్పొరేటర్లు - Visakhapatnam News
విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తనఖా పెట్టడాన్ని తెలుగుదేశం, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు వ్యతిరేకించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
TDP corporators Concern in GVMC