ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల ఆందోళన - విశాఖలో ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు

ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ విశాఖలో తెదేపా ఆందోళనలకు సిద్ధమైంది. ఆ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మరోవైపు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

tdp cpi protest
tdp cpi protest

By

Published : Jun 11, 2021, 7:37 PM IST

పెరిగిన ఆస్తి పన్నుపై పోరాటానికి తెదేపా సిద్ధమైంది. విశాఖ పార్లమెంట్​ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తెదేపా కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ తీర్మానం పెట్టకుండా పెంచుతున్న పన్నును ఒప్పుకోవద్దని.. కౌన్సిల్​లో పెద్ద ఎత్తున్న పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:HPCL Report:హెచ్‌పీసీఎల్‌ ప్రమాదానికి నిర్వహణ లోపాలే కారణం

ABOUT THE AUTHOR

...view details