శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్
'లోక్సభలో మద్దతు ఇచ్చారు...రాష్ట్రంలో ద్రోహం చేశారు' - క్యాబినెట్లో ఎన్పీఆర్ బిల్లు తీర్మానాన్ని వ్యతిరేకించటంపై భాజపా మండిపాటు
లోక్సభలో సీఏఏకు మద్దతు ఇచ్చి మంత్రివర్గ సమావేశంలో ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ద్రోహం అని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఇలా ద్వంద వైఖరి అవలంభించడం రాజకీయ పార్టీల విశ్వాసానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్పై ప్రజల్లో అభద్రతాభావం తొలగించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు.

శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్