ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశ ఆరంభమైంది. రెండో దశలో భారతీయులను మాల్దీవుల నుంచి తీసుకువచ్చేందుకు ఐఎన్ఎస్ జలాశ్వ మళ్లీ మాల్డీవులకు చేరుకుంది. మాలే పోర్టునుంచి శుక్రవారం నాడు తిరిగి భారతీయులతో బయలు దేరనుంది. రెండో దశలో 700 మందిని స్వదేశానికి తీసుకురానుంది. ఈనెల 12న కొచ్చి నౌకాశ్రయానికి 698 మంది భారతీయులను జలాశ్వ తీసుకువచ్చింది. మళ్లీ బయలుదేరి మాలేకి చేరుకున్న ఈ నౌక... శుక్రవారం రాత్రి తిరిగి కొచ్చికి వస్తుంది. ఇందులో ఉన్నవారిలో 100 మంది మహిళలు, పిల్లలు కాగా... మిగిలిన వారు పురుషులు. వీరంతా కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే నౌక ద్వారా స్వదేశానికి తీసుకురానున్నారు.
ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశ.. 700 మంది స్వదేశానికి - ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశ
ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశ ఆరంభమైంది. రెండో దశలో భారతీయులను మాల్దీవుల నుంచి తీసుకువచ్చేందుకు ఐఎన్ఎస్ జలాశ్వ మళ్లీ మాల్డీవులకు చేరుకుంది. రెండో దశలో 700 మందిని స్వదేశానికి తీసుకురానుంది. ఈనెల 12న కొచ్చి నౌకాశ్రయానికి 698 మంది భారతీయులను జలాశ్వ తీసుకువచ్చింది.

ఐఎన్ఎస్ జలాశ్వ