విదేశాల్లో ఉన్న మన పౌరులపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావానికి సంబంధించి.. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. సముద్రం ద్వారా వారిని తరలించడానికి తగిన సన్నాహాలు చేయాలని భారత నావికాదళాన్ని ఇప్పటికే ఆదేశించింది. ఈ ప్రక్రియను ఆపరేషన్ "సముద్ర సేతు"గా ప్రారంభించింది. రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల్లోని ఇండియన్ మిషన్ నావికాదళ ఓడల ద్వారా తరలించాల్సిన భారతీయ పౌరుల జాబితాను సిద్ధం చేసింది.
వైద్య పరీక్షల తరువాత వీరిని ప్రయాణానికి అనుమతిస్తారు. మొదటి దశలో మొత్తం వెయ్యి మందిని తరలించాలని నిర్ణయించారు. భౌతిక దూరం నిబంధనలను పాటించేలా చర్యలుతీసుకుంటారు. ఈ ఆపరేషన్ కోసం నౌకలను తగిన విధంగా సిద్ధం చేశారు. మార్గం సమయంలో ప్రాథమిక సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఆహార వసతి కల్పిస్తారు. భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.