విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండవ టోల్‌గేట్‌ను ప్రారంభించారు. లాక్డౌన్ అనంతరం స్వామి వారి దర్శనార్థం భక్తుల రాక పెరగటంతో ఈ వసతి కల్పించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. విశాఖ నుంచి వచ్చే భక్తులకు కొత్త టోల్గేట్ వద్దే దర్శనం టిక్కెట్లు కూడా విక్రయిస్తున్నామన్నారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండవ టోల్ గేట్ ప్రారంభం - toll gate news
విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో రెండో టోల్‌గేట్‌ను ప్రారంభించారు. అన్‌లాక్ అనంతరం భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దేవాదాయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అప్పన్న సన్నిధిలో రెండవ టోల్ గేట్ ప్రారంభం
కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద దర్శనం టిక్కెట్లు ఇస్తుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వారాంతంలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా..నగరం నుంచి వచ్చేవారు టోల్గేట్ మార్గాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:విశాఖ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు