విశాఖపట్నం జిల్లా తగరపువలసలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంధాలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలకు వెళ్లి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని మంత్రి అన్నారు. పుస్తక పఠనాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. గ్రంధాలయాలు విజ్ఞానంతో పాటు మేథో సంపత్తిని పెంపొందిస్తాయని తెలిపారు.
గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి
విశాఖ జిల్లా తగరపువలసలో గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతో కృషి చేస్తాయని పేర్కొన్నారు.
తగరపువలసలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి