విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ జానియర్ కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధన ప్రారంభమైంది. జూమ్ యాప్ ద్వారా అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరవలేని పరిస్థితి రావటంతో... ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్లైన్లో బోధన చేస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. వైవీఎల్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలో 39 ప్రభుత్వ జునియర్ కళాశాలలో ఆన్లైన్ బోధన జరుగుతుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పి.సోమరాజు వెల్లడించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభం
విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనట్లు వృత్తి విద్యాశాఖాధికారి పి. సోమరాజు తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు