ఉల్లి ధర కిలో రూ.25- బారులు తీరిన జనం
విశాఖలో రూ.25 ఉల్లి కోసం జనం బారులు - ONION rates updates
విశాఖపట్నం రైతుబజార్లో ఉల్లిపాయల కోసం స్థానికులు బారులుతీరారు. కిలో ఉల్లిని రూ.25కే అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో ఉల్లి ధర ఎక్కువగా ఉండటంతో రైతుబజార్లో డిమాండ్ బాగా ఉందని చెబుతున్నారు.

onion-rates
ఉల్లి ధరలు కొండెక్కడంతో... రైతు బజార్లో అమ్ముతున్న ఉల్లిపాయల కోసం ప్రజలు బారులుతీరుతున్నారు. విశాఖలోని రైతు బజార్లలో... కిలో ఉల్లిని 25 రూపాయలకు అందిస్తున్నారు. 15 టన్నుల ఉల్లిని రాయితీ ధరపై ఇస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల... రేపటి నుంచి 20 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.