ఉల్లి ధర వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.వారం రోజుల్లోనే10రూపాయల మేర ధర పెరగటంతో విశాఖలో వినియోగదారులు సతమతమవుతున్నారు.బయటి మార్కెట్‌తో పాటు రైతుబజార్‌లోనూ కిలో ఉల్లి35నుంచి40రూపాయల మేర అమ్ముతున్నారు.ధరల పెరుగుదలతో కిలో కొనాల్సిన చోట అరకిలోతోనే సరిపెడుతున్నామంటున్నారు ప్రజలు.
'సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్న ఉల్లి ధర' - onion rates
కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం వినియోగించే ఉల్లిని అధిక ధరలకు కొనలేక వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. ఉల్లి దిగుబడి తగ్గిందని... ఫలితంగా పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు తీసుకొస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
onion-rates
కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రంలో వర్షాల కారణంగా...గ్రామల నుంచి సరకు రవాణా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.మహారాష్ట్ర నుంచి ఉల్లి తెప్పిస్తున్నామని వివరించారు.సరకు ధరతోపాటు రవాణా ఛార్జీలు తోడవటం వల్ల ధరలు పెరిగాయంటున్నారు.ఉల్లి ధర పెరగటంతో...హోటల్స్,రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశాలున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.