ప్రస్తుతం వర్షాలు తగ్గినా.. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని ప్రధాన జలాశయాలైన రైవాడ, పెద్దేరు, కోనాం నుంచి దిగువ నదుల్లోకి వరద నీటిని అధికారులు విడిచి పెడుతున్నారు. అన్ని జలాశయాల్లోకి ప్రస్తుతం ఎగువ నుంచి వరదనీరు వస్తోంది. ఇప్పటికే నీటిమట్టాలు పూర్తి స్థాయిలో ఉండటంతో అదనపు నీటిని విడుదల చేస్తున్నారు.
రైవాడ జలాశయం ఇన్ ఫ్లో 1402 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1402 క్యూసెక్కులుగా ఉంది. పెద్దేరు జలాశయం ఇన్ ఫ్లో 1391 క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 1296 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. కోనాం జలాశయం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 750 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.