ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు పనుల్లో కొనసాగుతున్న జాప్యం - vishakapatnam latest update

రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రారంభించిన మనబడి నాడు-నేడు పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా సిమెంట్ కొరతతో చాలా చోట్ల పనులు స్తంభించిపోయాయి. బహిరంగ మార్కెట్ కంటే 60 శాతం తక్కువ ధరకు సరఫరా చేస్తున్నప్పటికీ బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం ఎదురవుతుందని అందువల్ల సిమెంట్ సరఫరా చేయలేమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

నాడు-నేడు పనుల్లో కొనసాగుతున్న జాప్యం
నాడు-నేడు పనుల్లో కొనసాగుతున్న జాప్యం

By

Published : Oct 4, 2020, 8:33 AM IST

విశాఖ జిల్లాలో నాడు-నేడు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జిల్లాలో నాడు - నేడు పనులకు గాను 1149 పాఠశాలలను తొలివిడతగా ఎంపిక చేశారు. ఇందుకోసం రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాది జూన్ రెండో రెండో వారానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . అయితే మార్చి నెలాఖరు నుంచి కరోనా వ్యాప్తి చెందటంతో లాక్ డౌన్ కారణంగా కొన్నిచోట్ల పనులు ఆగిపోగా.. అత్యధిక పాఠశాలలో పనులు అసలు ప్రారంభం కాలేదు. దీంతో పనులు పూర్తి చేయాలని జులై నెల వరకు తర్వాత ఆగస్టుకు పొడిగించుకుంటూ వచ్చారు. అయినప్పటికీ నిధులు కొరత, మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, దీనికితోడు వర్షాల కారణంగా అక్టోబర్ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. అయినా సరే పనుల్లో మాత్రం పురోగతి లేదు.

ఏ పనికైనా సిమెంట్ ముఖ్యమని, సుమారు నెల నుంచి సిమెంట్ సరఫరా కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలంటే మరో 1700 టన్నుల సిమెంటు అవసరమని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. జిల్లాకు ఇంతవరకు రూ.6 కోట్ల విలువ చేసే సిమెంటు సరఫరా చేయగా అందులో నాలుగు కోట్ల బిల్లులు మాత్రమే పూర్తయ్యాయని ఇంకా రెండు కోట్ల బకాయిలు ఉన్నాయని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి.

విశాఖ జిల్లాకు సంబంధించి ఈ బకాయిలు తక్కువేనని, మిగిలిన జిల్లాల్లో ఎక్కువ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని సరఫరా సిమెంట్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ 400 కంటే ఎంతో ఎక్కువ ధర ఉందని ప్రభుత్వ పనులు కోసం రూ.235కే సరఫరా చేస్తున్నామని కంపెనీ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 40 రోజుల నుంచి సిమెంటు సరఫరా నిలిపివేశారు.

ఇదీ చదవండి

'మళ్లీ పుట్టిన గాంధీ'... ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?: రఘురామ

ABOUT THE AUTHOR

...view details