ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం.. 12 మంది అరెస్ట్ - 1000 kilos Cannabis seized

వెయ్యి కిలోల భారీ గంజాయిని తరలిస్తుండగా దొంగల ముఠాపై పోలీసులు దాడి చేశారు. అనంతరం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

వెయ్యి కిలోల భారీ గంజాయి స్వాధీనం
వెయ్యి కిలోల భారీ గంజాయి స్వాధీనం

By

Published : Nov 7, 2020, 4:04 PM IST

విశాఖ మన్యం నుంచి అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా డుంబ్రిగూడ పోలీసులు పట్టుకున్నారు. డుంబ్రిగూడ మండలం సమీపంలో బొలెరోలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అరకులోయ సీఐ పైడయ్య పేర్కొన్నారు.

10 మంది ఒడియన్లు..

నిందితుల్లో పది మంది ఒడిశావాసులతో పాటు స్థానికులు ఇద్దరు ఉన్నారని సీఐ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వివరించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న డుంబ్రిగుడ ఎస్ఐ గోపాలరావు సహా సిబ్బందిని సీఐ పైడయ్య అభినందించారు.

ఇవీ చూడండి : భూ సమస్యను పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్​ కాళ్లపై పడిన రైతు

ABOUT THE AUTHOR

...view details