విశాఖలోని సింహాచల వరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి గెడ్డం ఉమా అనే యువతిని తొలగిస్తున్నట్లు... దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రస్ట్ బోర్డ్ నియమ నిబంధనల ప్రకారం ఉండవలిసిన వయోపరిమితి తక్కువ ఉండడంతో ఆమెను బోర్డ్ నుంచి తొలగించినట్లు సమాచారం. స్వామివారి ట్రస్ట్ బోర్డు ఏర్పాటయి సుమారు ఐదు నెలలు గడుస్తోంది. ఈ సభ్యురాలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. సంచయిత గజపతిరాజు సింహాచల దేవస్థాన ఛైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సింహాచల ఆలయ ట్రస్ట్ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు - simhachalam trust board latest news
సింహాచల వరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి గెడ్డం ఉమను తొలగిస్తున్నట్లు... దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డ్ ప్రకారం వయో పరిమితి తక్కువ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సింహాచల ఆలయ ట్రస్ట్ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు