విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ చిట్టివలసలో జూట్ మిల్ గోడ కూలి ఓవ్యక్తి మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్టివలస జూట్ మిల్ పరిశ్రమ మూతపడడంతో యంత్రాలను వేరే చోటుకి తరలించారు. అనంతరం శిథిలాలను తొలగిస్తుండగా గోడ కూలి కిలారి చంద్రశేఖర్ (45) అనే కార్మికుడు మృతి చెందాడు. పిట్టా శ్రీనివాస్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోడ కూలి ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు - chittivalasa crime news
గోడ కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం విశాఖపట్నం జిల్లా చిట్టివలసలో జరిగింది.
గోడ కూలి ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు