To allow a compassionate death : ఏళ్లుగా తిరుగుతున్నా సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని ఓ వ్యక్తి కోరారు. విశాఖ నగరంలోని మధురవాడలోని కాలనీలో అప్పటి వుడా అనుమతించిన లేఅవుట్‌లో ప్లాట్లను కొనుగోలు చేశామని... దానిని 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టారని...కాజా చిన్నారావు అనే ఆయన ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా, స్పందనలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఏళ్లుగా సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. ఇక కారుణ్య మరణానికి అనుమతించాలని స్పందనలో వినతిపత్రం ఇచ్చానని.. ఐతే కలెక్టర్ అత్యంత నిర్లక్ష్యంగా తనను చనిపోవాలని ఆదేశించారని చెప్పారు. ప్రజా కష్టాలు తెలుసుకునే అధికారులే అసహనాన్ని చూపించడం పై న్యాయ పోరాటం చేస్తానని బాధితుడు అసంతృప్తి వెలిబుచ్చారు.
స్పందనలో కానరాని స్పందన.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి.. - VUDA
To allow a compassionate death : విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెట్టుకోవడం సంచలనమైంది. సోమవారం విశాఖ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో కాజా చిన్నా రావు కారుణ్య మరణానికి అనుమతి కోసం ఆర్జీ పెట్టారు. ఆ వ్యక్తి అలా ఎందుకు చేేేేసాడంటే...
కాజా చిన్నారావు
Last Updated : Nov 15, 2022, 10:09 AM IST