ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డుడుమ జలపాతంలో యువకుడు గల్లంతు - duduma waterfall news

డుడుమ జలపాతం వద్ద శుక్రవారం ప్రమాదం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా వన భోజనాలుకు వచ్చిన పర్యటకుడు కాలుజారి జలపాతంలో పడిపోవటంతో విషాదం నెలకొంది.

missing at duduma waterfall
డుడుమ జలపాతంలో ఓ యువకుడు గల్లంతు

By

Published : Jan 1, 2021, 10:24 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల డుడుమ జలపాతంలో ఓ యువకుడు గల్లంతుయ్యాడు. జయపురం సమీపంలో గల కాలియగాంకు చెందిన సత్యపరాజ(23) తన సోదరుడు, మిత్రులతో నూతన సంవత్సరం సందర్భంగా డుడుమ సందర్శించారు.

వీరిలో సత్యపరాజు ఒక బండ రాయి మీద గెంతుతుండగా అదుపు తప్పి నీటిలో పడి పోయాడు. మిత్రులు, సోదరుడు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న మాచ్​కండ్ పోలీసులు, లమతపుట్ అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details