ఇద్దరు డ్రైవర్ల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ నిండు ప్రాణాలు తీసింది. ఏఎస్సై అప్పారావు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంగి గ్రామానికి చెందిన కూచిపూడి దుర్గారావు (42), కొడుకు రాజేంద్ర పవన్‌కుమార్‌తో కలిసి విజయవాడ నుంచి విశాఖకు పార్సిల్ సామగ్రితో గురువారం రాత్రి తన సొంత లారీలో బయలుదేరాడు. వీరి వాహన సైడ్ అద్దాన్ని శుక్రవారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట దాటిన తర్వాత ఇదే మార్గంలో వస్తున్న నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ చోదకుడు ఢీకొట్టి ఆపకుండా వచ్చేశాడు. దీనిపై ఆగ్రహించిన దుర్గారావు కాగిత టోల్‌గేట్ వద్ద ఆ డ్రైవర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో తండ్రీకొడుకులిద్దరూ కంటైనర్ ముందు భాగంలోకి ఎక్కి వేలాడగా, వాహనం వేగంతో వెళ్లి కాగిత సమీపంలో డివైడర్ దాటి కల్వర్టుని ఢీకొట్టి పొలాల్లోకి బోల్తా పడింది.
లారీ డ్రైవర్ల మధ్య చిన్న వివాదం.. తీసింది ప్రాణం - పాయకరావు పేటలో లారీ ప్రమాదం
చిన్న వివాదం కారణం ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఇద్దరు డ్రైవర్ల మధ్య జరిగిన చిన్న వివాదం కారణంగా నిండు ప్రాణం పోయింది. లారీని ఢీకొట్టి ఆపకుండా వెళ్లాడనే కోపంతో.. ఆ డ్రైవర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. లారీ డివైడర్ దాటి కల్వర్టుని ఢీకొట్టి పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట సమీపంలో జరిగింది.
![లారీ డ్రైవర్ల మధ్య చిన్న వివాదం.. తీసింది ప్రాణం accident at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12341526-164-12341526-1625294295164.jpg)
ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ డివైడర్ మధ్యలో పడిపోగా గాయాలయ్యాయి. దుర్గారావు వాహనం మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏఎస్సై అప్పారావు, హెచ్‌సీ నరసింహారావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తొలుత నక్కపల్లి, అక్కడినుంచి అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహం లారీ కింద చిక్కుకుపోవడంతో స్థానికుల సాయంతో బయటకు తీసి, శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన చోదకుడు పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని సీఐ వి.నారాయణరావు, ఎస్సై ఎం.వి.రమణ పరిశీలించారు. పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: