సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ విశాఖలో యువభారత్ ఫోర్స్ సంస్థ లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మూడు అంశాలపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తామని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ సాదిక్ స్పష్టం చేశారు. రాష్ట్రపతితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డులు పంపుతామని తెలియజేశారు. దిల్లీలో జరిగిన హింసాయుత దాడులను ఆయన ఖండించారు. ఘటనపై కేంద్రహోమంత్రి అమిత్షా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సాదిక్ డిమాండ్ చేశారు.
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం - లక్ష పోస్టుకార్డుల ఉద్యమం
విశాఖలో యువభారత్ ఫోర్స్ సంస్థ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మూడు అంశాలపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తామని సంస్థ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
పోస్టుకార్డుల ఉద్యమం