ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కోటిన్నర విలువ చేసే గంజాయి పట్టివేత - విశాఖలో గంజాయి పట్టివేత వార్తలు

విశాఖ జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. కోటిన్నర విలువ చేసే మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మినుములూరు నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

గంజాయి పట్టివేత
గంజాయి పట్టివేత

By

Published : Jun 9, 2021, 4:32 PM IST

కోటిన్నర విలువ చేసే మూడు టన్నుల గంజాయిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. పాడేరు దరి మినుములూరు నుంచి దిల్లీకి గంజాయిని తరలించే ముఠాను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక కంటైనర్‌ లారీలో మినుములూరు నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు... సబ్బవరం రహదారిలో రెక్కి నిర్వహించారు.

యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న లారీని పట్టుకున్న పోలీసులు.. తనిఖీ చేయగా గంజాయిని ఉన్నట్టు గుర్పించారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ ల్తెక్ , తాజీబ్ ఆలంలుగా గుర్తించారు. గంజాయి రవాణా కోసం లారీ ప్రత్యేకంగా ఓ క్యాబిన్​ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:రేషన్ బియ్యం పట్టివేత.. నిందితులు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details