విశాఖ జిల్లా అనకాపల్లిలోని చినబాబు కాలనీలో వ్యక్తి ఉరివేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్. భీమవరానికి చెందిన ఎస్. వెంకట సింహాద్రి అప్పలనాయుడు అలియాస్ నాయుడు.. భార్య, కుమార్తెతో చినబాబు కాలనీలో ఉంటున్నారు. అనకాపల్లి మండలం కూండ్రమ్లో ప్రైవేటు కాన్వెంట్ను నిర్వహించేవారు.
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. తనకు ఉన్న భూమిని అమ్మి అప్పులు తీర్చాలని అనుకున్నాడు. కానీ.. భూమిని విక్రయించేందుకు నాయుడు తల్లి చల్లయమ్మ, తమ్ముడు హేమ సుందర్రావు ఒప్పుకోలేదు. ఈ కారణంగా మనస్థాపం చెందిన నాయుడు ఇంట్లోనే.. ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.